PBKS vs MI Qualifier 2 Records IPL 2025 | చరిత్రది ఏముందిరా చింపేస్తే చిరిగిపోతుంది
అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా చరిత్రది ఏముంది రా చింపేస్తే చిరిగిపోతుంది అని అచ్చం అలానే చరిత్రను చెత్త బుట్టలో పడేసి అద్భుత విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్. ఈ ప్రాసెస్ లో అనేక రికార్డులు పంజాబ్ ను వెక్కిరించాయి. నీ వల్ల కాదురేయ్ అన్నాయ్ కానీ పంజాబ్ ఆగలేదు. అసలు ముంబై 18ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వాళ్లెప్పుడు కూడా 200 పరుగులు చేస్తే ఓడిపోయిందే లేదు. 18సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన ముంబై ఇండియన్స్ 18కి 18సార్లు విజయం సాధించింది. కానీ నిన్న మాత్రమే 203 పరుగులు చేసి 204 టార్గెట్ పెట్టినా పంజాబ్ తొలిసారి ఆ మిత్ ను బ్రేక్ చేసింది. ఇంగ్లిస్, అయ్యర్, వధేరా పోరాటంతో పంజాబ్ 5వికెట్లతేడాతో విక్టరీ అందుకుని ముంబై అజేయ రికార్డును బ్రేక్ చేసింది. గత ఏడు మ్యాచుల్లో అహ్మదాబాద్ గ్రౌండ్ లో ముందు బ్యాటింగ్ చేసిన జట్టే 7సార్లు గెలిచింది. పంజాబ్ దాన్ని కూడా బ్రేక్ చేసింది. టాస్ గెలిచినా కూడా బ్యాటింగ్ ముంబైకి అప్పగించి మరీ ముంబై పెట్టిన 200 ప్లస్ స్కోర్ ను ఛేజ్ చేసి మరీ సెకండ్ బ్యాటింగ్ ఆడి గెలిచింది పంజాబ్. 18ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ నాకౌట్ మ్యాచుల్లో ఎప్పుడూ 204 పరుగుల స్కోరును ఎవరూ ఛేజ్ చేయలేదు..కానీ పంజాబ్ చేసి చూపించింది. ఐపీఎల్ ఏ టీమ్ కూడా 8 సార్లు 200 ప్లస్ టార్గెట్ లను ఛేజ్ చేయలేదు. పంజాబ్ ఆ రికార్డును కూడా బ్రేక్ చేసింది. కళ్ల ముందు ఐదుసార్లు కప్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఉన్నా కూడా పంజాబ్ కు ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడినా అనుభవం ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఆ క్షణం ఆ నిమిషం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చెలరేగారు కాబట్టే చరిత్రలు చెత్తబుట్టలతో సంబంధం లేకుండా పంజాబ్ కింగ్స్ ముంబైపై అద్భుతమైన విఝయం సాధించి ఫైనల్ చేరుకోగలిగింది.