PBKS vs LSG Match Highlights IPL 2025 | లక్నోపై 37పరుగుల తేడాతో పంజాబ్ విజయం | ABP Desam

 మ్యాచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత పదిలం చేసుకోవచ్చనే కాంక్షతో పంజాబ్...ప్లే ఆఫ్స్ ఆశలు మెరుగుపర్చుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన లక్నో తలపడిన ఇవాళ్టి ఐపీఎల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో...మొదటి ఓవర్ లోనే మొదటి వికెట్ గా ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేసినా...ప్రభ్ సిమ్రన్ సహా మరే టాప్ ఆర్డర్ పంజాబ్ బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా ప్రభ్ సిమ్రన్ రెచ్చిపోయి ఆడాడు...48 బాల్స్ లో 6ఫోర్లు 7 సిక్సర్లతో 91పరుగులు చేసిన ప్రభ్ సిమ్రన్ పంజాబ్ భారీ స్కోరు చేసేందుకు ప్రధాన కారణమయ్యాడు. జోష్ ఇంగ్లీష్ 30 రన్స్, కెప్టెన్ అయ్యర్ 45పరుగులు చివర్లో శశాంక్ సింగ్ 33పరుగులు బాదటంతో పంజాబ్ ఈ సీజన్ లో తమ హయ్యెస్ట్ స్కోరైన 236పరుగులు చేసింది. 237 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నోను ఆదుకునే నాధుడే లేకుండా పోయాడు. వాళ్ల టాప్ త్రీ బ్యాటర్లైన మార్ క్రమ్, మిచ్ మార్ష్,నికోలస్ పూరన్  ఘోరంగా ఫెయిల్ అవటంతో 27పరుగులకే 3వికెట్లు కోల్పోయింది లక్నో. ఆ దశలో కెప్టెన్ పంత్ మరోసారి టీమ్ ను ఆదుకోకపోయినా..ఆయుష్ బడోనీ, అబ్దుల్ సమద్ మంచి పోరాటం చేశారు పంజాబ్ మీద. బడోనీ 40 బంతుల్లో 5ఫోర్లు 5 సిక్సర్లతో 74పరుగులు చేస్తే..అబ్దుల్ సమద్ 24 బాల్స్ లో 45పరుగులు చేశాడు. ఈ ఇద్దరు వెంట వెంటనే అవుటవటం...చేధించాల్సిన లక్ష్యం చాలా ఉండటంతో నిర్ణీత 20 ఓవర్లలో 199పరుగులు చేయగలిగింది లక్నో. మంచి పోరాటమే అని చెప్పాలి. కానీ ఈ విజయంతో పంజాబ్ పదిహేను పాయింట్లతో టేబుల్ లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. లక్నో మాత్రం  అదే ఏడో స్థానంలో ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola