PBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీ

అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ పాటలోలా... ఒకడేమో ఆరడుగుల బుల్లెట్టు. పేరు మార్కో జాన్సన్. ఆరడుగుల ఎనిమిది అంగుళాల హైట్ ఉంటాడు. యాక్టివ్ గా ఉన్న క్రికెటర్లతో అత్యంత పొడుగైన వ్యక్తి. అలాంటి మార్కో జాన్సన్ నిన్న కేకేఆర్ పై సంచలన ప్రదర్శన చేశాడు. 111 పరుగుల పంజాబ్ స్కోరును కాపాడే క్రమంలో మూడు కీలక వికెట్లు తీశాడు జాన్సన్. అందులో అత్యంత ప్రమాదకరమైన సునీల్ నరైన్, ఆంద్రే రస్సెల్ వికెట్లు ఉన్నాయి. హర్షిత్ రానాను అవుట్ చేసి 3 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఈ వికెట్లు తీసుకున్న జాన్సన్..ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేయటమే బుల్లెట్ లాంటి తన బౌలింగ్ ఎంత పదునుగా సాగిందో చెబుతుంది. ఇక మరొకడు ధైర్యం విసిరిన రాకెట్టు. పేరు యుజవేంద్ర చాహల్. ఒంటి ఊపిరితో అసలు బాడీలో ఓపిక ఉందా లేదా అన్నట్లు ఉంటాడు కానీ ఏం వేశాడండీ నిన్న బౌలింగ్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసింది నేనే రా తమ్ముడు అన్నట్లు 111 పరుగుల స్కోర్ ను కాపాడుకునే క్రమంలో సెట్ బ్యాటర్స్ అయిన కెప్టెన్ అజింక్యా రహానే, కుర్రోడు ఆంగ్ క్రిష్ రుఘువంశీ, హిట్టర్ రింకూ సింగ్, మరో హిట్టర్ రమణ్ దీప్ సింగ్ ఎవ్వడినీ వదిలి పెట్టలేదు చాహల్. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే 4 వికెట్లు తీసుకోవటం పాటు మ్యాచ్ ను మలుపు తిప్పి కేకేఆర్ నడ్డి విరిచి పంజాబ్ కు ఐపీఎల్ చరిత్రలోనైన అత్యంత సంచలన విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola