
Nita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP Desam
ముంబైలో ఈరోజు స్టార్లుగా ఉన్న వాళ్లందరినీ ఎలా కనిపెట్టామో నాకు ఇంకా గుర్తుంది. అప్పట్లో నేను ప్రతీ రంజీ మ్యాచ్ కు వెళ్లేదాన్ని. నా మనుషులు ప్రతీ దేశవాళీ మ్యాచ్ కు హాజరయ్యేవాళ్లు. అలా మా వాళ్లు ఓ రోజు ఇద్దరు బాగా బక్కచిక్కిన చిన్న కుర్రాళ్లను తీసుకువచ్చారు. నేను వాళ్లతో మాట్లాడితే వాళ్లు మూడేళ్లుగా మ్యాగీ, నూడుల్స్ మాత్రమే తిని బతుకుతున్నారని అర్థమైంది. కారణం వాళ్ల దగ్గర డబ్బుల్లేవు. కానీ నేను వాళ్లలో క్రికెట్ మీద ఎంతో ప్రేమ, కసి చూశాను. ఆ ఇద్దరే హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. 2015లో పదివేల యూఎస్ డాలర్లు వెచ్చించి వేలంలో హార్దిక్ పాండ్యాను కొన్నాం. పదేళ్లు గిర్రును తిరిగేసరికి అతనే ఈ రోజు మన ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడు. పాండ్యా దొరికిన తర్వాత ఏడాదే మా వాళ్లు ఇంకో కుర్ర క్రికెటర్ ను పట్టుకొచ్చారు. అతని బౌలింగ్ తీరే చాలా విభిన్నంగా ఉంది. తనను వదిలేయ్..తన బౌలింగ్ చూడు అని చెప్పారు. ఆ కుర్రాడే బుమ్రా..ఈ రోజు మిగిలినదంతా చరిత్ర. గతేడాది తిలక్ వర్మ అనే ఇంకో కుర్రోడిని లాంఛ్ చేశాం. ఇప్పుడు అతనూ టీమిండియాకు ఆడేస్తున్నాడు.