Ms Dhoni 110 M Six Vs Rcb | RCB vs CSK Highlights | సిక్స్‌ కొడితే స్టేడియం అవతల పడింది.. ఇదే మైనస్

Ms Dhoni 110 M Six Vs Rcb | RCB vs CSK Highlights  | ధోని భారీ సి‌క్సు కొట్టడంతో ఆర్సీబీకి ప్లస్ ఐంది. అదేలా అంటే.. చివరి ఓవర్ లో చెన్నై ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టాలంటే 17 పరుగులు కావాలి. క్రీజులో ది ఫినిషర్ ధోని... ఊపు మీదున్న జడేజా ఉన్నారు. సో.. కచ్చితంగా ప్రెజర్ బౌలర్ యశ్ దయాల్ పైనే ఉంటుంది. ఐతే..ఫస్ట్ బాల్ కే ధోని 110 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది కానీ.. ఆ 110 మీటర్ల సిక్సర్ ఏకంగా స్టేడియం బయట పడింది. దీంతో..తలా ఫ్యాన్స్ అంతా ఖుషీ ఐతే..క్రికెట్ గురించి తెలిసిన వాళ్లు మాత్రం షాకయ్యారు. ఎందుకంటే.. అప్పటికే షైనింగ్ పోయిన బాల్ ను ధోని స్టేడియం బయటికి పంపించాడు. దీంతో..కచ్చితంగా కొత్త బాల్ తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా కొత్త బాల్ బౌలర్ కు అడ్వాంటేజ్ గా మారుతుంది. స్వింగ్ కు ఈజీగా మారుతుంది. నిన్న కూడా అదే జరిగింది. ఫస్ట్ సి‌క్సు ఇచ్చిన యశ్ నెక్ట్స్ స్లో బాల్ వేసి ధోనిని బోల్తా కొట్టించాడు. ఆ తరువాత 4 బాల్స్ లో 11 పరుగులు కొట్టాల్సి ఉండగా... స్వింగ్ , స్లో బాల్స్ తో కేవలం ఒక్క పరుగే ఇచ్చి హీరోగా మారిపోయాడు. అలా.. ధోని కనుక స్టేడియం బయటికి బాల్ కొట్టకపోయి ఉండుంటే.. బౌలర్ గా న్యూ బాల్ అడ్వాంటేజ్ ఉండేది కాదని క్రికెట్ విశ్లేషకులు ఫీలవుతున్నారు. దీంతో.. ఒక్కోసారి మనం చేసే మంచి పని..మన టీమ్ కంటే అవతలి టీమ్ కే ఎక్కువగా ఉపయోగపడుతుందంటే బహుశా ఇదే కావొచ్చు. మరి..ధోని సి‌క్సు..దాని తరువాత జరిగిన లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola