MI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP Desam

 ఐపీఎల్ లో ఎల్ క్లాసికో అని చెప్పుకునే మ్యాచ్ ఈ రోజు జరగబోతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో చెన్నై ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకోగా...ఇప్పుడు బదులు తీర్చుకునేందుకు సొంతగడ్డపై MI ఆశగా ఎదురు చూస్తోంది. అయితే ఈ మ్యాచ్  రెండు టీమ్స్ కి చాలా అంటే చాలా అవసరం. ఈ సీజన్ ఇప్పటికే సగం మ్యాచ్ లు పూర్తవగా...ముంబై పాయింట్స్ టేబుల్ లో 7వ స్థానంలోనూ...చెన్నై సూపర్ కింగ్స్ మరీ ఘోరంగా ఆఖరి స్థానమైన 10వ స్థానంలోనూ ఉన్నాయి. ఆడిన 7మ్యాచుల్లో ముంబై 3 గెలిచి నాలుగు ఓడిపోతే...చెన్నై ఆడిన 7 మ్యాచుల్లో 5 ఓడిపోయి రెండు మాత్రమే గెలిచింది. ధోని కెప్టెన్ అయిన తర్వాత LSG పై గత మ్యాచ్ లు విజయం అందుకున్న చెన్నై మరి ఈ మ్యాచ్ లో ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి. చెన్నై గత మ్యాచ్ లో రచిన్ తోడుగా కొత్తకుర్రోడు షేక్ రషీద్ ను ఆడించింది. అశ్విన్ ను పక్కనపెట్టి ఓవర్టన్ ను తీసుకుంది. ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుని లాస్ట్ మ్యాచ్ లో దూకుడు చూపించాడు. అదే దూకుడు కంటిన్యూ కావాల్సిన అవసరం ఉంది. ఇక ముంబై సంగతి చూస్తే లాస్ట్ మ్యాచ్ లో రోహిత్ శ ర్మ వింటేజ్ షో చూపించాడు. మూడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. చూడాలి మరి హిట్ మ్యాన్ ఎలా ఆడతాడో. సూర్య, హార్దిక్, బుమ్రాలు ముంబైకి కొండంత అండ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola