MI Bowler Ashwani Kumar Biography | IPL 2025 లో సంచలన అరంగేట్రం చేసిన అశ్వనీ కుమార్ | ABP Desam

 కెరీర్ లో మొట్ట మొదటి మ్యాచ్ ఆడే కుర్రాడిలా కనిపించలేదు అతను. ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్ లను కలిపి కొట్టినట్లుంది అతని యాక్షన్. కెరీర్ లో మొదటి బంతికే రహానే అవుట్..తర్వాత ఓవర్లో రింకూ సింగ్ అవుట్...మనీష్ పాండే క్లీన్ బౌల్డ్...ఆ తర్వాతి ఓవర్లో ఆంద్రే రస్సెల్ వికెట్లు బద్ధలేసుకుపోయాయి. వేసిన మూడు ఓవర్లలో వీళ్లు కేకేఆర్ లో తోపు బ్యాటర్లురా అన్న వాళ్లందిరనీ అవుట్ చేశాడు ఓ 23 ఏళ్ల కుర్రాడు తన పేరే అశ్వనీ కూమార్. పంజాబ్ కు చెందిన అశ్వనీ కుమార్ ను గతేడాది ఆక్షన్ లో బేస్ ప్రైస్ 30 లక్షలకు సైలెంట్ గా కొనేసుకుంది ముంబై ఇండియన్స్. తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు వరుసగా రెండు మ్యాచుల్లోనూ విఫలం అవటంతో తనను పక్కన పెట్టి అశ్వనీ కుమార్ కు అవకాశం కల్పించింది. తనే ఈ రోజు అరంగేట్ర మ్యాచ్ లో 4 వికెట్లతో సంచలనమే సృష్టించాడు. 2023లో పంజాబ్ లో జరిగిన షేర్ ఈ పంజాబీ టీ20 ట్రోఫీలో అశ్వనీ కుమార్ టాలెంట్ ను గుర్తించి ముంబై స్కౌటింగ్ టీమ్. ఆ ఏడాది లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్న అశ్వనీ కుమార్ ను గుట్టు చప్పుడు కాకుండా ఆక్షన్ లో రిజిస్టర్ చేసుకోమని చెప్పి...చల్లగా వేలంలో 30 లక్షలకే కొట్టేసింది. 2019-20 పంజాబ్ తరపున రంజీ మ్యాచ్ లు ఆడినా..2021-22 పంజాబ్ తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడినా సెలెక్టర్ల దృష్టిలో పడలేకపోయిన అశ్వనీ కుమార్.. ఇప్పుడు అతనే ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబైకి తొలి విజయాన్ని అందించి వార్తల్లో నిలిచాడు. మొదటి మ్యాచ్ లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అశ్వనీ కుమార్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది అదేంటంటే అతని చేతి మీది టాటూ. ఐ యామ్ ఎనఫ్ అని రాసి ఉంటుంది. నేను చాలు నీకు అని. అంత కాన్ఫిడెన్స్ ఆ కుర్రాడిది. చూడాలి ఏ రేంజ్ కు వెళ్తాడో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola