LSG vs SRH Match Highlights IPL 2025 | రెండు మ్యాచ్ లు ఉండగానే ఎలిమినేట్ అయిపోయిన లక్నో

Continues below advertisement

 సన్ రైజర్స్ హైదరాబాద్. భారీ ఆశలతో, 300 పరుగుల రికార్డులు బ్రేక్ చేసేస్తారన్న ఊహలతో ఐపీఎల్ 2025 సీజన్ ను ప్రారంభించింది. అనుకున్నదొకటి అయినదొక్కటి అన్నట్లు 12 మ్యాచుల్లో నాలుగే విజయాలతో అస్సాం ట్రైన్ ఎక్కేసింది ఆరెంజ్ ఆర్మీ. అయితే వెళ్తూ వెళ్తూ ఖాళీగా వెళ్లటం ఎందుకని LSG కి కూడా తమతో పాటే వచ్చేలా తత్కాల్ టికెట్ చేయించింది నిన్న. టాస్ గెలిచినా బ్యాటింగ్ తమకే ఇచ్చిన ఆరెంజ్ ఆర్మీ ఫీల్ అయ్యేలా బ్యాటింగ్ అయితే బాగానే చేసింది LSG. కెప్టెన్ పంత్ సహా మిగిలిన జట్టంతా సెల్ ఫోన్ నెంబర్లు పెట్టిన  ఈ సీజన్ లో లక్నో విజయాలకు కారణమైన మిచ్ మార్ష్, మార్ క్రమ్, పూరన్ మళ్లీ చెలరేగటంతో 205పరుగులు చేసింది లక్నో. ఎకానా స్టేడియంలో 200 ప్లస్ స్కోరును ఇప్పటి వరకూ ఏ టీమ్ ఛేజ్ చేయకపోవటంతో కాన్ఫిడెన్స్ మీద బౌలింగ్ దిగిన LSG కి హైదరాబాద్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. హెడ్ లేకున్నా అభిషేక్ శర్మ అల్లాడించాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 59పరుగులు బాదేశాడు అభిషేక్ శర్మ. 295 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. దిగ్వేష్ అభిషేక్ ను అవుట్ చేయటంతో పాటు క్రీజులో కుదురుకున్న ఇషాన్ కిషన్ ను 35పరుగుల మీదున్నప్పుడు క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ క్లాసెన్ ఆదుకున్నాడు SRH ను. 28 బాల్స్ లో 47 పరుగులతో క్లాసెస్ దుమ్ము రేపితే..కమిందు మెండిస్ 21 బాల్స్ లో 32 పరుగులు చేయటంతో SRH సక్సెస్ ఫుల్ గా 206 పరుగులు చేయటంతో పాటు 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి లక్నో ప్లే ఆఫ్ ఆశలకు వాళ్ల హోం గ్రౌండ్ ఎకానా స్టేడియంలోనే సమాధి చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola