LSG vs RCB Preview IPL 2025 | టాప్ 2 లో ఆడాలంటే ఆర్సీబీ కచ్చితంగా గెలవాల్సిందే
ఈ సీజన్ లో అంతా అద్భుతంగా ప్లేఆఫ్స్ బెర్త్ కొట్టేసినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన ఒక్క షాక్ కి టాప్ 2 లో ప్లేస్ కోసం నానా పాట్లు పడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. తమకు అనుకూలంగా రిజల్ట్ రావాలంటే తమ మ్యాచుల్లో చెన్నై, ముంబై కచ్చితంగా విజయం సాధించాలన్నా చెన్నై గుజరాత్ పై గెలిస్తే..ముంబై నిన్న పంజాబ్ పై ఓడిపోయి ఎలిమినేటర్ ఆడుకోవటానికి ప్రిపేర్ అయిపోతోంది. మరి ఆర్సీబీ ఎలిమినేటర్ ఆడుతుందా లేదా క్వాలిఫైయర్ 1 ఆడుతుందా తెలియాలంటే ఈ రోజు జరిగే లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూడాల్సిందే. ఈ సీజన్ లో జట్టు బాగానే ఉన్నా అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయిన లక్నో తమ ఆఖరి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కి షాకిచ్చిన ఉత్సాహంలో ఉంది. వెళ్తూ వెళ్తూ ఆర్సీబీ క్వాలిఫైయర్ 1 అవకాశాలను కూడా దెబ్బ తీయాలని కచ్చితంగా ట్రై చేస్తుంది. LSG లో టాప్ 3 బ్యాటర్లే ప్రమాదకరం. మార్ క్రమ్, మార్ష్, పూరన్ ఈ సీజన్ లో ఈ ముగ్గురూ కలిపి 17 హాఫ్ సెంచరీలు కొట్టారు. మార్ క్రమ్, మార్ష్ ఆరు హాఫ్ సెంచరీలు కొడితే..పూరన్ ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. అలాంటి మార్ క్రమ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రిపరేషన్ కోసం వెళ్లిపోవటం LSG కి చిన్న లోటే. ఆర్యన్ జుయెల్ అనే టాప్ ఆర్డర్ ఆడే యంగ్ స్టర్ కి ఛాన్స్ ఇవ్వాలని LSG భావిస్తోంది చూడాలి. పంత్ గుజరాత్ మీద మ్యాచ్ లో రెండు నో లుక్ షాట్స్ సిక్సర్లు కొట్టి ఆశ్చర్యపరిచాడు. మరి 27కోట్లు పెట్టి కొనుక్కున్న తన ఓనర్ గోయెంకాను సంతోష పెట్టేలా ఆఖరి మ్యాచ్ లో అయినా చెలరేగుతాడేమో చూడాలి. నోట్ బుక్ సెలబ్రేషన్ చేయటానికి ఓ మ్యాచ్ నిషేధం తర్వాత దిగ్వేష్ రాఠీ ఈ రోజు మ్యాచ్ కి తిరిగి రానున్నాడు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ల బలం బలగం అన్నీ మచ్చలపులి విరాట్ కొహ్లీనే. ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి రావటం తనకు చిరాకు తెప్పించి ఉండొచ్చు. ఆ ఫ్రస్టేషన్ కనుక కొహ్లీ మైండ్ లో ఉంట్లే లక్నో బౌలర్లను ఇవాళ చీల్చి చెండాటం ఖాయం. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ పటీదార్ ఇవాళ ఫుల్ గా ఆడొచ్చు. ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ టాప్ 2 ప్లేస్ కోసం దుమ్ము రేపాలని ఆర్సీబీ ఆశిస్తోంది. బౌలింగ్ లో జోష్ హేజిల్ వుడ్ టీమ్ కోసం తిరిగి రావటం కొండంత అండ అయితే లుంగీ ఎన్గిడీ, జాకొబ్ బెత్ హెల్ తమ తమ దేశాలకు ఆడటం కోసం వెళ్లిపోయారు. చూడాలి మిగిలి ఉన్న ఈ ఒక్క లీగ్ మ్యాచ్ లో సత్తా చాటి ఆర్సీబీ టాప్ 2 పొజిషన్ ను సీజ్ చేసుకుని క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ ను ఢీకొడుతుందా లేదా ఎలిమినేటర్ లో ముంబైతో తలపడుతుందా ఈ రోజు తేలిపోనుంది.