KKR vs SRH Qualifier 1 |IPL 2024 |KKRది తొలి పంచ్.. ఫైనల్ పంచ్ మాత్రం SRHదేనా..? | ABP Desam

KKR vs SRH Qualifier 1 |IPL 2024 | ఎంతో ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. నేడు సాయంత్రం కేకేఆర్ వెర్సస్ ఎస్ ఆర్హెచ్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. దీనిలో గెలిచిన వాళ్లు నేరుగా ఫైనల్ లోకి అడుగుపెడతారు. సో.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం ఐతే.. SRH ఫ్యాన్స్ మాత్రం ఈ మ్యాచ్ రివెంజ్ అని కూడా అంటున్నారు. ఎలాగంటే.. ఈ ఐపీఎల్ లో ఈడెన్ గార్డెన్స్ తో KKR , SRH తమ తొలి మ్యాచ్ లో తలపడ్డాయి.  ఆ మ్యాచ్ లో కేకేఆర్ 208 పరుగులు చేయగ్గా..SRH 204 పరుగులు మాత్రమే చేసింది. ఐనప్పటికీ.. క్లాసెస్ 29 బాల్స్ లోనే 63 పరుగులు కొట్టడం సంచలనంగా మారింది. ఐతే ఆ మ్యాచులో హర్షిత్ రానా మయాంక్ అగర్వాల్ వికెట్ తీసుకుని.. ఇలా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. అది SRH ఫ్యాన్స్ కు ఎక్కడో కాలేలా చేసింది. దీంతో.. రివేంజ్ తీసుకుందామంటే గ్రూప్స్ సిస్టమ్ వల్ల కేవలం కేకేఆర్ తో ఒక్క మ్యాచే జరిగింది. సో.. ఇప్పుడు దానికి రివేంజ్ తీసుకునే సమయం వచ్చింది. అది కూడా కీలకమైన క్వాలిఫైయర్-1లో సో...కొడితే ఇంకోసారి కిస్ ఇవ్వడానికి బెదిరిపోవాలా అన్నట్లుగా ఫ్యాన్స్ పోస్టులు వేస్తున్నారు. మనోళ్లు ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ పిచ్చ ఫామ్ లో ఉన్నారు కాబట్టి హర్షిత్ రానానే టార్గెట్ చేసి.. 4 ఓవర్లలో 50కు పైగా పరుగులు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ రోజు అది జరుగుతుందో లేదో చూద్దాం..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola