Jofra Archer Bowling vs PBKS IPL 2025 | నిద్ర పవర్ ఏంటో చాటి చెప్పిన జోఫ్రా ఆర్చర్ | ABP Desam

 వర్క్ లోడ్ బాగా ఉన్నప్పుడు ఓ చిన్న పవన్ న్యాప్ కొట్టండి చాలా ఫ్రెష్ గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. మోర్ ఫోకస్డ్ గా పని చేయగలుగుతారనే స్టడీస్ మీరు ఏమన్నా చదివారా. ఒకవేళ లేకుంటే హియర్ ఈజ్ ది ఎగ్జాంపుల్ జోఫ్రా ఆర్చర్. నిన్న రాజస్థాన్ రాయల్స్ కి, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది కదా ముల్లాన్ పూర్ లో. ఆ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ తీసుకుని రాజస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, కెప్టెన్ శామ్ సన్, వన్ డౌన్ లో రియాన్ పరాగ్ అందరూ పంజాబ్ బౌలర్లను చితక్కొట్టేయటంతో RR 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మరి తమ బ్యాటర్లంతా ఈ రేంజ్ లో దుమ్మురేపుతున్నప్పుడు ఓ బౌలర్ ని అయిన తనెందుకు టెన్షన్ పడాలి అనుకున్నాడేమో జోఫ్రా ఆర్చర్ అసలు మ్యాచే చూడకుండా డ్రెస్సింగ్ రూమ్ లో నిద్ర పోయాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు కెమెరాస్ లో కూడా దీన్ని చూపించారు. మ్యాచ్ టెన్షన్ లేకుండా హ్యాపీగా కునుకేశాడు ఆర్చర్. చివర్లో లేపినట్లున్నారు రెడీ అయ్యాడు ఒకవేళ ఆడాల్సి వస్తదేమో అని. బట్ అవసరం పడలేదు. బట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ పవర్ న్యాప్ ఇచ్చిన ఫ్రెష్ ఎనర్జీనో ఏమో కానీ పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు జోఫ్రా ఆర్చర్. 206 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ ను మొదటి ఓవర్లోనే గల్లంతు చేసి పారేశాడు జోఫ్రా ఆర్చర్. పంజాబ్ కి బీభత్సమైన ఫామ్ లో ఉన్న ఇద్దరు బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్యను మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ చేసిన జోఫ్రా ఆర్చర్...ఆఖరి బంతికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను క్లీన్ బౌల్డ్ ను చేశాడు. దీంతో పంజాబ్ 15పరుగులకే 2 వికెట్లు కోల్పోయి మొదటి ఓవర్ లోనే మ్యాచ్ పై ఆశలు కోల్పోయింది. మిగిలిన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో పంజాబ్ 155 పరుగుల మాత్రమే చేయగలిగింది. ప్రియాంశ్, అయ్యర్ తో పాటు అర్ష్ దీప్ వికెట్ కూడా తీసుకున్న జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 25పరుగులు చేసి మూడువికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. పవర్ న్యాప్ పవర్ అది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola