IPL Franchises Owners Meet Heat | వాడీ వేడిగా జరిగిన ఐపీఎల్ ఓనర్ల సమావేశం | ABP Desam
ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు జరిగిన ఫ్రాంచైజీ ఓనర్ల సమావేశం వాడీ వేడీగా జరిగింది. మెగా ఆక్షన్ కి ముందు రిటెన్షన్ ప్లేయర్ల విషయంలో ఫ్రాంచైజీ ఓనర్ల నుంచి అభిప్రాయాలు సేకరించాలని బీసీసీఐ భావించింది. ఇందుకోసం ముంబై వాంఖడే స్టేడియంలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఈ సారి ఐపీఎల్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్ ఓనర్ షారూఖ్ ఖాన్, ఫైనలిస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మానర్, పంజాబ్ ఓనర్ నెస్ వాడియా, ప్రీతి జింతా ఇలా ప్రముఖలు అంతా వచ్చారు. అయితే రిటెన్షన్ ప్లేయర్లు ఎంత మందిని టీమ్ తో ఉంచుకోవాలి అనే విషయంలో ఓనర్ల మధ్య వాడీ వేడి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు షారూఖ్ ఖాన్, కావ్యా మారన్ అయితే వింతగా మెగా ఆక్షన్ ఇప్పటికిప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముందని వాదించారట. ఐపీఎల్ గెలిచిన టీమ్ సభ్యులను ఎలా వదులుకోమంటారు వాళ్లకు ఏమని చెప్పాలంటారు అని షారూఖ్ ఖాన్ మీటింగ్ లో ప్రతిపాదన ఉంచారట...అనూహ్యంగా ఈ ప్రతిపాదనకు సన్ రైజర్స్ ఓనర్ కావ్యామారన్ నుంచి సపోర్ట్ కూడా లభించింది. వీళ్లిద్దరూ కలిసి మెగా ఆక్షన్ బదులుగా కావాలనుకుంటే మినీ ఆక్షన్ పెట్టాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారని తెలుస్తోంది. అయితే ఇదే సందర్భంలో షారూఖ్ ఖాన్ కి, పంజాబ్ కింగ్స్ ఓనర్ నెస్ వాడియా మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. మెగా ఆక్షన్ జరగాలని అయితే రిటెన్షన్ ప్లేయర్ల విషయంలో సంఖ్య 8వరకూ ఉండాలని నెస్ వాడియా సూచించారట. దీనికి షారూఖ్ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మినీ ఆక్షన్ కి వెళ్దామని ఇందులో మరే అంశం ఉండక్కర్లేదని షారూఖ్ చెప్పటంతో మాటమాటా పెరిగిందని ఆ తర్వాత బీసీసీఐ పెద్దలు కలుగు చేసుకుని సమస్యను సద్దుమణింగించారని తెలుస్తోంది. అయితే ఓనర్ల మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేదని బీసీసీఐ ప్రతినిధి చెప్పారు. ఇది కేవలం ఫ్రాంచైజీల అభిప్రాయాలను తీసుకోవటానికి మాత్రమే ఏర్పాటు చేశామన్నారు.