Hardik Pandya vs LSG IPL 2025 | LSG తో మ్యాచ్ లో పాండ్యా ఏం చేసినా గెలవలేదు

Continues below advertisement

 వాస్తవానికి లక్నో సూపర్ జెయింట్స్ 204 పరుగుల టార్గెట్ ఇచ్చినా ముంబై దాన్ని ఛేజ్ చేయటానికే చూసింది. రోహిత్ శర్మ లేడనే భయం లేకుండా ఓపెనర్లు విల్ జాక్స్, ర్యాన్ రికెల్టెన్ దారుణంగా ఫెయిల్ అయినా సూర్య కుమార్,నమన్ ధీర్ పోరాటంతో ముంబై నిలబడింది. అయితే వాళ్లిద్దరూ అవుటైనా క్రీజులోకి దిగిన కెప్టెన్ పాండ్యా, తిలక్ వర్మ తో కలిసి మ్యాచ్ ఫినిష్ చేస్తారనే ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తిలక్ ను పాండ్యా రిటైర్ట్ అవుట్ అయిపోయమన్నాడు. శాంటర్న్ ను దింపాడు. అది బ్యాక్ ల్యాష్ అయ్యింది. రెండోది బ్యాటర్ గా పాండ్యా బాగానే ఆడాడు 16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తో 28 పరుగులు చేశాడు. కానీ లక్ష్యం మరీ పెద్దదిగా ఉండటంతో ఏం చేయలేకపోయాడు పాండ్యా. బౌలింగ్ లోనూ అంతే...మిగిలిన ముంబై బౌలర్లు అంతా ఆకట్టుకోకపోయినా హార్దిక్ పాండ్యా మాత్రం మెరిశాడు. రెగ్యూలర్ ఇంటర్వెల్స్ లో ఇంటికి పంపుతూ తన కెప్టెన్సీ షో చూపించాడు హార్దిక్ పాండ్యా. మార్ క్రమ్, పూరన్, పంత్, డేవిడ్ మిల్లర్ లాంటి లక్నో తోపు బ్యాటర్లందరినీ పెవిలియన్ కు పంపాడు పాండ్యా. చివర్లో ఆకాశ్ దీప్ వికెట్ కూడా తీసి 4 ఓవర్లలో 36పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయటం ద్వారా సంచలన ప్రదర్శన చేశాడు. ఇటు బౌలింగ్ లో ఐదు వికెట్లు అటు బ్యాటింగ్ లో మంచి రన్స్ కొట్టినా కెప్టెన్ గా తిలక్ ను రిటైర్డ్ అవుట్ అవ్వమని చెప్పినా ఏం చేసినా కూడా హార్దిక్ పాండ్యా లక్ష్యం నెరవేరలేదు. నిజంగా బ్యాడ్ లక్ అనుకోవాలో..లేదా మరీ దరిద్రానికి పాండ్యా కేరాఫ్ అడ్రస్ అనుకోవాలో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola