GT vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ పై 38 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP Desam
ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడింది సన్ రైజర్స్ హైదరాబాద్. ముందు బౌలింగ్ లో తర్వాత బ్యాటింగ్ లో రెండు విభాగాల్లోనూ ఫెయిలైన సన్ రైజర్స్ ...38 పరుగుల తేడాతో విజయాన్ని గుజరాత్ చేతిలో పెట్టేసిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. సాయి తోడుగా చెలరేగిన గిల్
మిస్టర్ కన్సిస్టెన్సీ గా పేరు తెచ్చుకున్న సాయి సుదర్శన్ తోడుగా కెప్టెన్ గిల్ చెలరేగిపోయాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ నిర్ణయాన్ని తప్పని నిరూపించేలా..సాయి, గిల్ కలిసి దుమ్మురేపారు. 23 బాల్స్ లో 9ఫోర్లు బాదిన సాయి సుదర్శన్ 48పరుగులు చేసి అవుటవగా..గిల్ మాత్రం దుమ్మురేపాడు. 38 బాల్స్ లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 76పరుగులు చేసి గుజరాత్ భారీ స్కోరుకు బాటలు వేశాడు.
2. జోస్ బట్లర్ జోష్
సుదర్శన్ అయిపోయాక గిల్ తో కలిసిన జోస్ బట్లర్ 37 బాల్స్ లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 64పరుగులు చేశాడు. తనదైన శైలిలో చెలరేగి ఆడుతూ చూపించిన దూకుడుతోనే గుజరాత్ స్కోరు 200 దాటింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాట్ ఝుళిపించటంతో సన్ రైజర్స్ ముందు 225 పరుగుల భారీ లక్ష్యం పెట్టగలిగింది జీటీ. సన్ రైజర్స్ బౌలర్లో ఉనద్కత్ మాత్రమే 3 వికెట్లు తీయగా మిగిలివన వాళ్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
3. ఆరెంజ్ ఆరంభం ఓకే కానీ
225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కి మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ బాదుతూనే ఉన్నారు. 4ఓవర్లలో 49పరుగులు చేసిన టైమ్ లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో హెడ్ అవుటవటంతో సన్ రైజర్స్ కి పెద్ద షాక్ తగిలింది. అది మొదలు ఇక షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇషాన్, అనికేత్ ఇలా వచ్చి అలా వెళ్లారు.
4. అభిషేక్ శర్మ పోరాడినా
హెడ్ అవుట్ అయినా..మిగిలిన వికెట్లు పడుతున్నా..నెట్ రన్ రేట్ భారీగా పెరుగుతున్నా సన్ రైజర్స్ కి ఎక్కడో హోప్స్ ఉన్నాయంటే కారణం క్రీజులో అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారని. కానీ అభిషేక్ కీలక సమయంలో గేర్లు మార్చలేకపోయాడు. ఓవరాల్ గా 41 బాల్స్ లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 74పరుగులు చేసినా మరో ఎండ్ లో సహకరించేవాడు లేకపోవటంతో రిక్వైడ్ రన్ రేట్ పెరిగిపోతూనే వెళ్లింది. 15 ఓవర్ ఆఖరి బంతికి ఇషాంత్ బౌలింగ్ లో అభఇిషేక్ అవుట్ అవ్వటంతో సన్ రైజర్స్ కి ఇక ఉన్న హోప్స్ కూడా పోయాయి.
5. ప్రసిద్ధ్ సూపర్ బౌలింగ్
ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కి భారీ హిట్టర్లున్నా ప్రసిద్ధ్ కృష్ణ భలే కంట్రోల్ చేశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు ీశాడు.అవి కూడా ప్రమాదకర ట్రావియెస్ హెడ్ ఇంకా హెన్రిచ్ క్లాసెన్. అభిషేక్ బాగానే ఆడుతున్నా వీళ్లద్దిరినీ ప్రసిద్ధ్ అవుట్ చేయటంతో సన్ రైజర్స్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి పోరాడే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. ఫలితంగా సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 186పరుగులు మాత్రమే చేసి 38 పరుగులు తేడాతో గుజరాత్ పై ఓటమిని మూట గట్టుకుంది.
ఈ పరాజయంతో సన్ రైజర్స్ తన ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకోగా...గుజరాత్ టైటాన్స్ మాత్రం పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి దూసుకెళ్లింది.