Facts About Virat Kohli’s Controversial LBW Call: ముంబయితో మ్యాచ్ లో విరాట్ ఔటా కాదా? | ABP Desam

Continues below advertisement

Mumbai Indians తో జరిగిన మ్యాచ్ లో Royal Challengers Bangalore సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో Virat Kohli ఔటైన తీరు చాలా Controversial గా మారింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో Dewald Brevis వేసిన తొలి బంతిని కోహ్లి డిఫెండ్ చేశాడు. బ్యాట్, ప్యాడ్ కి దగ్గరగా బాల్ ఉండటంతో ఫీల్డింగ్ టీం LBW కోసం అప్పీల్ చేసింది. అంపైర్ ఔటిచ్చాడు. కోహ్లీ రివ్యూ కోరాడు. చాలా సార్లు రీప్లే చూసిన థర్డ్ అంపైర్.... బాల్ ముందుగా ప్యాడ్ ను తాకిందని, ఆ తర్వాత వికెట్లను తగులుతుందని భావించి ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ వాస్తవానికి బాల్.... బ్యాట్, ప్యాడ్ ను ఒకే టైంలో తగిలింది. MCC Cricket Laws ప్రకారం ఇలాంటి సిట్యుయేషన్స్ లో బాల్ ముందుగా బ్యాట్ ను తగిలినట్టు భావించాలి. అంపైర్ అలా కాకుండా ఔటివ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అప్పటికే ఆర్సీబీ దాదాపుగా గెలిచేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ డిసెషన్ చాలా ఇంపాక్ట్ చూపించి ఉండేది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram