DC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

Continues below advertisement

 ఐపీఎల్ లో తెలుగు వాళ్ల ఫ్రాంచైజీ అంటే ఏం చెప్తాం. అదేం ప్రశ్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్నది ఒకే ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ మా ఫుల్ సపోర్ట్ వాళ్లకే అని చెప్తాం అంతేగా. కానీ కాదు అసలు తెలుగు టీమ్ మేమే అంటోది మరో జట్టు. అదే ఢిల్లీ క్యాపిటల్స్. అదేంటీ పేరులోనే ఢిల్లీ పెట్టుకుని అదెలా తెలుగు టీమ్ అవుతుంది అంటే. ఓ థియరీ చెబుతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓనర్ GMR సంస్థ. JSW కు తో కలిసి ఉత్తరాంధ్రకు చెందిన వ్యాపార దిగ్గజం గ్రంథి మల్లిఖార్జున రావు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కొనుగోలు చేశారు. ఆ తర్వాత తమ సెకండ్ హోమ్ గా విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందుకే ఢిల్లీ కాకుండా వైజాగ్ కి వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ వేరే టీమ్స్ తో మ్యాచ్ లు ఆడుతోంది. అలా వైజాగ్ బేస్డ్ గా క్రికెట్ ఆడుతున్న తెలుగు వ్యక్తి సంస్థకు చెందిన జట్టు కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ తామే తెలుగు టీమ్ అంటోంది. ఇందుకు తగ్గట్లుగా విశాఖ క్రికెట్ స్టేడియం బయట ఇలా వైజాగ్ సొంత టీమ్ అని... అసలైన తెలుగు జట్టు అనే పోస్టర్లు కూడా కనపడుతున్నాయి ప్రమోషన్స్ లో. హైదరాబాద్ ఎందుకు కాదు అంటే డీసీ ఫ్యాన్స్ థియరీ లో.. సన్ రైజర్స్ హైదరాబాద్ ను నడిపిస్తోంది సన్ నెట్ వర్క్. అది తమిళనాడు బేస్డ్ వ్యాపారాలను నిర్వహించే సంస్థ. ఆ సంస్థ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్. పైగా హైదరాబాద్ కు కొన్నేళ్లుగా విదేశీ కెప్టెన్లే ఉంటూ వస్తున్నారు. గతంలో వార్నర్, తర్వాత విలియమ్సన్, ఆ తర్వాత ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఇలా ఫారెనర్స్ ఉంటున్నారు కెప్టెన్ గా. సో తమిళ సంస్థ, విదేశీ కెప్టెన్లు ఉన్న సన్ రైజర్స్ కంటే ఢిల్లీ క్యాపిటల్సే తెలుగు టీమ్ అని ఫ్యాన్స్ ఓన్ చేసుకుంటున్నారు. మరి చూడాలి ఈరోజు సాయంత్రం జరగబోయే ఈ తెలుగు వర్సెస్ తెలుగు పోరులో ఎవరు గెలవనున్నారో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola