DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RR

Continues below advertisement

 ఇప్పుడు లాస్ట్ ఓవర్ లో కొట్టాల్సింది 9 పరుగులు అండీ. చేతిలో ఇద్దరు హిట్టర్లు ఉన్నా కొట్టలేకపోయారు. సరే మిచెల్ స్టార్క్ తోపు కాబట్టి కొట్టలేకపోయారు అనుకోవచ్చు. గెలవాల్సిన మ్యాచ్ కాస్తా టై అయ్యింది. అది కూడా ఓకే. నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ లో సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. అప్పుడైనా బౌలింగ్ కి ఎవడొస్తున్నాడో చూసుకుని దింపాలిగా. లెఫ్ట్ హ్యాండర్ ను దింపారు. హెట్మెయర్ అప్పుడే ఓసారి తనను అదుపు చేసే 9 పరుగులు కొట్టకుండా ఆపాడు స్టార్క్. మళ్లీ కంట్రోల్ చేయాల్సి వచ్చింది హెట్మెయర్ ను.  మొదటి బంతికి మంచి యార్కర్ బాల్ వేసినా రెండో బంతికి హెట్మెయర్ ఫోర్ కొట్టాడు. థర్డ్ బాల్ కి హెట్మెయర్ సింగిల్ తీసుకుంటే..ఫోర్త్ కి బాల్ ఊహించని రీతిలో పరాగ్ కు స్టార్క్ నో బాల్ వేశాడు. అక్కడైనా రికవర్ అవ్వాలిగా లేదు ఫ్రీ హిట్ బాల్ ను స్టార్క్.. వైడ్ వేస్తే రన్ కి ప్రయత్నించి పరాగ్ రనౌట్ అయ్యాడు. ఎవడైనా ఫ్రీ హిట్ ను వేస్ట్ చేసి వైడ్ ని కెలికి పైగా రనౌట్ అవుతారా. RR వాళ్లు అయ్యారు. నెక్ట్స్ ఎవరిని పంపారు జైశ్వాల్ ను...మళ్లీ లెఫ్ట్ హ్యాండర్. లెఫ్టార్మ్ సీమ్ బౌలర్ కు లెఫ్ట్ హ్యాండర్ నే దింపుతారా ఎవరైనా. సరే ఏదో దింపారు అనుకుందాం. ఐదో బంతికి డబుల్ తీసే ప్రయత్నంలో జైశ్వాల్ కూడా రనౌట్ అయ్యాడు. అంటే కనీసం సూపర్ ఓవర్ అని ఓ ఓవర్ ఆడమంటే..కంగారు పడిపోయి ఆ ఓవర్ కూడా పూర్తిగా ఆడకుండా 11 పరుగులు మాత్రమే చేసింది రాజస్థాన్. ఢిల్లీలో కేఎల్ రాహుల్, స్టబ్స్ ఇద్దరూ కలిసి సందీప్ శర్మను సమర్థంగా ఎదుర్కొని కావాల్సిన 12 పరుగులు కొట్టేసి రాజస్థాన్ చేతుల్లోని మ్యాచ్ ను అమాంతం లాగేసుకుంది ఢిల్లీ. అలా వ్యూహాత్మక తప్పిదాలతో...అవసరం లేని కంగారుతో నాలుగేళ్ల తర్వాత జరిగిన సూపర్ ఓవర్ ను కిక్కు లేకుండా ముగించేలా చేసింది రాజస్థాన్ రాయల్స్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram