DC vs GT Match Highlights IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్ పై 10 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం | ABP Desam

 ఈ సీజన్ ఫస్టాఫ్ అంతా వరుస విజయాలతో దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్ సెకండాఫ్ లో అదే స్థాయిలో పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ప్లే ఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే ప్రతీ మ్యాచ్ కీలకంగా మారుతున్న తరుణంలోనూ ఢిల్లీ మ్యాచ్ లు ఓడుతుంటే..టాప్ 2 ప్లేస్ లో గుజరాత్ టైటాన్స్ ఎంత బీభత్సంగా ట్రై చేస్తుందో ఈరోజు మ్యాచ్ చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ విసిరిన 200 పరుగుల టార్గెట్ ను కనీసం వికెట్ కూడా కోల్పోకుండా పదివికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్. ఢిల్లీ పిచ్ మీద టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..ఫాఫ్ డుప్లెసీ వికెట్ ఎర్లీగా తీసినా ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ ను మాత్రం ఆపలేకపోయింది. ఓపికగా ఆడుతూ చెత్త బంతులనే బౌండరీలు కొడుతూ ఢిల్లీ స్కోరును నడిపించిన కేఎల్..సెంచరీ బాదేసి డీసీకి భారీ స్కోరును అందించాడు. 65 బంతుల్లో 14ఫోర్లు 4 సిక్సర్లతో 112 పరుగులు చేసి నాటౌట్ గా నిలవటంతో పాటు పోరల్, అక్షర్ పటేల్, స్టబ్స్  కూడా తలో చేయి వేయటంతో 199పరుగులు చేసింది ఢిల్లీ. గుజరాత్ బ్యాటింగ్ లో  పెద్ద గా చెప్పుకోవటానికి ఏం లేదు. ఎందుకంటే మ్యాచ్ ను ఓపెనర్లు ఇద్దరే ఫినిష్ చేసేశారు కాబట్టి. సాయి సుదర్శన్ ఈ సీజన్ లో తన అద్భుతమైన ఫామ్ ను మరింత పీక్స్ కి తీసుకెళ్తూ ఛేజింగ్ లో సూపర్ సెంచరీ బాదేశాడు. 61 బాల్స్ లో 12 ఫోర్లు 4 సిక్సర్లతో 108 పరుగులు చేస్తే..మరో ఎండ్ లో ప్రిన్స్ శుభ్ మన్ గిల్ 53 బాల్స్ లో 3ఫోర్లు 7 సిక్సర్లతో 93పరుగులు చేశాడు. దీంతో 19 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 205పరుగులు చేసి పదివికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టేయటంతో పాటు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయింది గుజరాత్. తనతో పాటు ఆర్సీబీ, పంజాబ్ ని కూడా ప్లే ఆఫ్స్ కి పట్టుకెళ్లిపోయింది. ఇక నాలుగో స్థానం కోసం ముంబై, ఢిల్లీ తలపడనున్నాయి. ఏదో ఓ మూల ఎక్కడో లక్నోకి ఛాన్స్ ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola