CSK vs SRH Match Highlights IPL 2025 | చెన్నై పై గెలిచి ఆశలు మిగుల్చుకున్న సన్ రైజర్స్
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన అవసరం నిన్న చెన్నై, హైదరాబాద్ రెండు జట్లకూ ఉంది. అప్పటికే లీగ్ లో 8 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ లు ఓడిపోయిన రెండు జట్లు మ్యాచ్ ను కచ్చితంగా సవాల్ గా తీసుకుంటాయని ముందే అర్థమైంది. కానీ చెన్నై అనూహ్య నిర్ణయాలతో షాక్ ఇచ్చింది. టాస్ గెలిచిన హైదరాబాద్ ముందు బౌలింగ్ తీసుకుంటే చెన్నై ఇద్దరు చిన్న కుర్రాళ్లను అసలు పిల్లలు అనొచ్చేమో వాళ్లను ఓపెనింగ్ దింపిది. 20 ఏళ్ల గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ తో పాటు మరో ఓపెనర్ 17ఏళ్ల ఆయుష్ మాత్రమే. ఈ సీజన్ లో కాన్వే, రచిన్ లాంటి కివీస్ ఓపెనర్ల తో ఇన్నింగ్స్ లు ప్రారంభించిన సీఎస్కే అవేం వర్కవుట్ కాకపోవటంతో టీమ్ పిల్లలకు ఛాన్స్ ఇచ్చేసింది. నెక్ట్స్ సీజన్ కి ఫైనల్ 11 ఎవరో సెట్ చేసుకునేలా ఈ మ్యాచ్ ను చెన్నై ఇంత లైట్ గా తీసుకుంటుందని ఎవరూ అనుకుని ఉండరు. వన్ డౌన్ లో శామ్ కర్రన్, టూ డౌన్ రవీంద్ర జడేజా, ఫోర్త్ ప్లేస్ లో మరో చిన్న కుర్రాడు డెవాల్డ్ బ్రూయిస్ తో డెబ్యూ చేయించింది చెన్నై సూపర్ కింగ్స్. మాత్రే 30 పరుగులు, బ్రూయిస్ ఫస్ట్ మ్యాచ్ లో 42 పరుగులు చేయటం మినహా ధోని సహా మిగిలిన ఏ చెన్నై బ్యాటరూ కనీసం పోరాడకపోవటంతో కనా కష్టం మీద CSK 154 పరుగులు చేయగలిగింది. బౌలింగ్ లో పవర్ ప్లేలోనే అభిషేక్, హెడ్ వికెట్లు అయితే చెన్నై బౌలర్లు తీయగలిగారు కానీ కొట్టాల్సింది పెద్ద స్కోరు కాకపోవటంతో ఇషాన్ కిషన్, కమిందు మెండిస్ లు పోరాడి ఫాస్ట్ గా ఛేజ్ చేసి సన్ రైజర్స్ 5వికెట్ల తేడాతో విజయం సాధించటంతో పాటు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది.