CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

Continues below advertisement

  చెన్నై సొంత గడ్డపై ఆడుతోంది అనే బెదురు లేదు. ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టనే ఆలోచన లేదు. కళ్ల ముందు 210 పరుగుల భారీ లక్ష్యం ఉందనే బెరుకు లేదు. పంజాబ్ కింగ్స్ దుమ్ము రేపింది. చెన్నై విసిరిన భారీ లక్ష్యాన్ని అవలీలగా ఊదిపారేస్తూ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్..తొలుత సీఎస్కే ను కట్టడి చేసేందుకు ఇబ్బంది పడింది.  సంజూ శాంసన్ ను 7పరుగులకే ఔట్ చేయగలిగినా...తొలుత గైక్వాడ్ తర్వాత దూబేతో కలిసి ఆయుష్ మాత్రే పంజాబ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 43 బాల్స్ లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 73పరుగులు చేసిన మాత్రమే ఔట్ అవ్వటంతో సీఎస్కే స్లో అయ్యింది. చివర్లో సర్ఫరాజ్ 32పరుగుల మెరుపులకు తోడు...లేట్ గా ఊపు అందుకున్న శివమ్ దూబే 27 బాల్స్ లో 45పరుగులు చేయటంతో చెన్నై 5వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి..పంజాబ్ కు 210 టార్గెట్ ఇచ్చింది. అయితే ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ మ్యాచ్ ఫస్ట్ బాల్ నుంచే రెచ్చిపోయారు. ప్రత్యేకించి ఆర్య 11 బాల్స్ లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 39 పరుగులు, ప్రభ్ సిమ్రన్ 43 పరుగులు చేయటంతో కావాల్సిన అద్భుతమైన ఆరంభం లభించింది. కాన్లే 36, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 పరుగులు చేసి లక్ష్యాన్ని అవలలీలగా కరిగిపోయేలా చేశారు. చివర్లో శశాంక్, స్టాయినిస్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి 18.4 ఓవర్లలోనే  210 పరుగుల టార్గెట్ ను అందుకుని ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కి ఘన విజయాన్ని అందించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola