Abhishek Sharma Batting In IPL 2024 | దూకే ధైర్యమా జాగ్రత్త... అభిషేక్ శర్మ ముంగిట నువ్వెంత
Abhishek Sharma Batting In IPL 2024 | ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఒక్కో స్టార్ పుడుతుంటాడు. ఈ 2024 సీజన్ కూడా అలాంటి ఓ స్టార్ ని అందించింది. వాడే సిక్సుల సూపర్ స్ట్రైకర్ అభిషేక్ శర్మ. ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచులో 28 బాల్స్ లోనే 235 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 66 పరుగులు కొట్టాడు. ట్రావెస్ హెడ్ డకౌట్ ఐనా మ్యాచ్ ను గెలిపించాడు. ఈ సీజన్ లో 450కిపైగా పరుగులు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 209గా ఉంది. అది మాస్ అనే చెప్పుకోవాలి. మొత్తంగా 35 ఫోర్లు, 41 సి క్సులు కొట్టాడు. ఏ ఐపీఎల్ లో ఐనా 40కి పైగా ఏ ఇండియన్ క్రికెటర్ సి క్సులు కొట్టలేదు. 41 సెక్సులతో సరికొత్త చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. ట్రావెస్ హెడ్ మరో ఎండ్ లో ఉన్నాడనే ధైర్యం కాదు.. ట్రావెస్ హెడ్ కే మనోడు మరో ఎండ్ లో ఉన్నాడని ధైర్యం. అంతలా ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. అవతల ఎంత పెద్ద బౌలర్ ఉన్నా ఈజీగా బౌండరీలు బాదేస్తున్నాడు. చూస్తుంటే ఇన్నాళ్లుకు యువరాజ్ సింగ్ కు రిప్లేస్ మెంట్ దొరికినట్లు అనిపిస్తోంది. ఇంతలా తను దుమ్ము దులపడానికి కారణం తన గురువు యువరాజ్ సింగ్ అంటున్నాడు అభిషేక్ శర్మ. పంజాబ్ లో పుట్టిన అభిషేక్ టాలెంట్ ను గుర్తించిన యువీ.. కొన్నాళ్లుగా మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడితో పాటు బ్రియాన్ లారా నుంచి కూడా అభిషేక్ శర్మ సూచనలు తీసుకున్నాడు. అలా.. ఇద్దరు లెజెండ్స్ సూచనలతో... సూపర్ రాక్ స్టార్ గా మారాడు అభిషేక్ శర్మ. ఇలాంటి సూపర్ స్ట్రైకర్ టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ కాకపోవడం బాధకరమైన విషయమే. ఐనప్పటికీ.. ఇలాగే ఆడుతు ఉంటే అతి త్వరలో టీం ఇండియా అభిషేక్ శర్మకు ఛాన్స్ ఇస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత మంది ఫారిన్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. ఇలా ఒక యంగ్ ఇండియన్ ప్లేయర్ బౌండరీలు బాదేస్తుంటే.. అది కూడా మన హైదరాబాద్ తరపున ఉంటే మస్త్ మజా వస్తుంది కదా..! ఇలాగే ఆడుతూ.. ఈ సారి SRHకు కప్ అందించాలని అభిషేక్ శర్మను కోరుకుంటున్నారు ఫ్యాన్స్..!