IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రికార్డు ధర పెట్టి కొన్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ప్రదర్శన అత్యంత చాలా పూర్ అనే చెప్పాలి. ఏకంగా 25.20 కోట్లతో KKR అత‌డిని దక్కించుకుంది. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తర్వాత ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన మూడవ ప్లేయర్ గా గ్రీన్ నిలిచాడు. 

డబ్బులు అయితే ఖర్చు చేసారు.. కానీ అందుకు తగ్గట్టుగా ప్రదర్శన మాత్రం కనబడటం లేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ పరంగా ఘోరంగా విఫలమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ మరోసారి నిరాశపరిచాడు. కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, ఫిన్ అలెన్ వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్ కేవలం 2 బంతులు ఆడి 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 

అంతకుముందు ముంబై ఇండియన్స్‌పై 18 పరుగులు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 2 పరుగులు మాత్రమే చేసిన గ్రీన్, ఈసారి కూడా ఫామ్ అందుకోవడంలో తడబడ్డాడు. గాయం కారణంగా బౌలింగ్ వేయ‌లేక పోతుండ‌టం కూడా  కేకేఆర్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. మరి కామెరూన్ ముందు ముందు ఎలా ప్రదర్శిస్తారో చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola