IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టింది. మూడు వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత ఢిల్లీపై విజ‌యం సాధించింది. చేపాక్ మైదానంలో జ‌రిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై 23 ప‌రుగుల‌తో ఘ‌న‌విజ‌యం సాధించింది. 

టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 212 ప‌రుగులు చేసింది. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ 56 బంతుల్లో 115 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అనంత‌రం ఛేద‌న‌లో ఓవ‌ర్ల‌న్నీ ఆడిన ఢిల్లీ.. 189 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 213 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఢిల్లీకి మంచి ఆరంభ‌మే ద‌క్కింది. ఓపెన‌ర్ల‌లో కేఎల్ రాహుల్ నెమ్మ‌దిగా ఆడ‌గా, ప‌థుమ్ నిస్సాంక ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. తొలి వికెట్ కు 61 ప‌రుగులు జత‌య్యాయి. ఇక 6వ ఓవ‌ర్లో ఫుల్ షాట్ ఆడ‌బోయి, రాహుల్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత ఒక లైఫ్ ల‌భించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయిన నిస్సాంక‌.. త‌ర్వాతి బంతికి మిడాన్ లో క్యాచిచ్చాడు. 

అఖిబ్ జావెద్ ను ఔట‌వ‌డంతో ఢిల్లీ ఆశ‌లు అడుగంటాయి. ఈ ద‌శ‌లో స్ట‌బ్స్ పోరాటం ఆక‌ట్టుకుంది. బౌండ‌రీల‌తో విరుచుకుప‌డి, టార్గెట్ ను క‌రిగించేందుకు ప్ర‌య‌త్నించాడు. 19వ ఓవ‌ర్లో త‌ను ఔట్ కావ‌డంతో ఢిల్లీ ఓటమి పాలయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola