Watch: ఆర్సీబీతో కోల్‌కతా ఢీ.. ఓడిన జట్టు ఇంటికే!
ABP Desam
Updated at:
11 Oct 2021 03:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్లో నేడు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు క్వాలిఫయర్ 2 ఆడే అవకాశం ఉంటుంది. లీగ్ లీడర్ ఢిల్లీపై చివరి బంతికి విజయం సాధించి.. రాయల్ చాలెంజర్స్ ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇక కోల్‌కతా కూడా తన చివరి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఏకంగా 86 పరుగులతో విజయం సాధించింది. ఈ రెండు జట్లూ విజయాలతో ఉండటంతో ఈ మ్యాచ్ కూడా థ్రిల్లింగ్‌గా సాగే అవకాశం ఉంది. డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి రెండు జట్లూ కచ్చితంగా తమ బెస్ట్ ఇస్తాయి.