ఆసియా కప్ 2025 ఫైనల్ చేరుకున్న ఇండియన్ వుమన్స్ హాకీ టీమ్
టీమిండియా ఆసియా కప్ 2025 ఫైనల్ చేరుకుంది. ఈ మాట వినగానే అదేంటి? ఆసియా కప్ మొదలైందే రెండు రోజుల క్రితం, అండ్ ఇండియా ఆడింది ఒక్క మ్యాచే కదా? అప్పుడే ఫైనల్లో ఎలా? అని డౌట్ వచ్చిందా..? అయితే సారీ. ఇది క్రికెట్ ఆసియా కప్ కాదు. హాకీ ఆసియా కప్ 2025. ఈ టోర్నీలో భారత మహాళల హాకీ టీం డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌ని 1-1 తో డ్రాగా ముగించుకుంది. అయితే .. ఇంకోవైపు కొరియాని 1-0 తేడాతో చైనా ఓడించడంతో చైనా నేరుగా ఫైనల్ చేరింది. అలాగే ఇండియా కూడా మెరుగైన పాయింట్స్ ఉండటంతో ఫైల్ చేరుకుంది. ఇక ఈ రోజు ఆదివారం జరగబోతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇండియన్ విమెన్స్ హాకీ టీమ్ చైనీస్ విమెన్స్ హాకీ టీంతో తలపడబోతోంది. అయితే ఈ టోర్నీని హోస్ట్ చేస్తున్న చైనా ఆల్రెడీ సూపర్ 4లో 9 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. జస్ట్ 4 పాయింట్లతో అతి కష్టం మీద ఫైనల్ చేరింది భారత్. మరి అలాంటి చైనాని ఇండియన్ వుమెన్స్ టీమ్ ఓడించగలదా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇదిా ఉంటే ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ 2026లో బెల్జియంలో జరగబోయే హాకీ వుమెన్స్ వరల్డ్‌కప్‌కి క్వాలిఫై అవుతుంది. మరి ఈ మ్యాచ్‌లో మన మహిళల జట్టు అద్భుతంగా ఆడి చైనాని ఓడించాలని కోరుకుందాం. ఏమంటారు?