భారత్, జింబాబ్వే ఐదో టీ20 మ్యాచ్ నేడే | ABP Desam

యంగ్ టీమిండియా ప్రస్తుతం జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఐదో మ్యాచ్‌ నేడు సాయంత్రం 4:30 గంటలకు జరగనుంది. ఈ సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా 3-1తో దక్కించుకుంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్ సెట్ కాలేదు. నాన్‌స్టాప్‌గా మార్పులు చేస్తూనే ఉన్నారు. ఈ సిరీస్ మొదటి రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ, గిల్ ఓపెనింగ్ చేశారు. రుతురాజ్ గైక్వాడ్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశారు. అభిషేక్ శర్మను వన్ డౌన్‌కు, రుతురాజ్ గైక్వాడ్‌ను సెకండ్ డౌన్‌కు పంపారు. ఐదో వన్డేలో రుతురాజ్‌ను ఏకంగా పక్కన పెట్టి రియాన్ పరాగ్‌కు ఛాన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాప్ ఆర్డర్‌ను సెట్ చేయడం కోసం కొత్త ప్లేయర్లను టెస్ట్ చేయడం అనేది మంచి విషయమే. కానీ అక్కడ కూడా ఏమాత్రం కన్సిస్టెన్సీ అన్నది లేకుండా బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇష్టం వచ్చినట్లు మారుస్తూ ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola