India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

Continues below advertisement

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) అత్యంత ఉత్కంఠభరిత ఘట్టం నేడు జరగబోతుంది. సూపర్-8 పోరులో వెస్టిండీస్‌తో టీమిండియా ( India vs West Indies ) తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

టీం ఇండియాలో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ( Arshdeep Singh ), వరుణ్ చక్రవర్తీలతో ( Varun Chakravarthy ) బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. మరోవైపు సిక్సర్ల సునామీ సృష్టించే వెస్టిండీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం. 2023లో భారత్‌పై టీ20 సిరీస్ గెలిచిన రికార్డు విండీస్ సొంతం. ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లలో విండీస్ మొదటి స్థానంలో ఉంటే, భారత్ రెండో స్థానంలో ఉంది.

భారత జట్టు ఓపెనర్లుగా సంజూ శాంసన్ ( Sanju Samson ), అభిషేక్ శర్మలను ( Abhishek Sharma ) కొనసాగించే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్‌లో రానుండగా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మిడిలార్డర్‌లో కీలకం కానున్నారు. వెస్టిండీస్ పవర్ హిట్టర్లను కట్టడి చేయడమే భారత్ ముందున్న ప్రధాన లక్ష్యం. టీమ్ ఇండియా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంటుందా? లేక విండీస్ షాక్ ఇస్తుందా? అనేది తెలుసుకోవాలంటన్ వేచి చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola