India vs West Indies Day 1 Highlights | అర్థ సెంచరీ చేసిన కే ఎల్ రాహుల్
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలిరోజే డామినేషన్ చూపించింది. తొలి టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన విండీస్ 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ ను సిరాజ్ వణికించాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్ తో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టాడు. చివర్లో సిరాజ్ ఫైవ్ వికెట్ హాల్ కోసం ప్రయత్నించినా లక్కు కలిసి రాలేదు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా.. తొలి రోజు ఆటముగిసేసరికి 38 ఓవర్లలో 2 వికెట్లకు 121 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫిఫ్టీతో సత్తా చాటాడు.
మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో కలిసి విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రాహుల్.. ఫోర్లతో అలరించాడు. ఆట ప్రారంభమైన వెంటనే జైస్వాల్ 7 ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. ఆ తర్వాత కట్ షాట్ కి ప్రయత్నించిన జైస్వాల్ ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన సాయి సుదర్శన్ విఫలమయ్యాడు. ఆలా తోలి టెస్ట్ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ పై టీమ్ ఇండియా బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పూర్తిగా డామినేషన్ చూపించింది.