India vs UAE Preview | నేడే ఇండియా vs UAE మ్యాచ్

ఆసియా కప్ టోర్నీలో భారత నేడు మొదటి మ్యాచ్ ను UAE తో ఆడబోతుంది. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీంగా ఈ టోర్నీలో ఇండియా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఆసియా కప్ లో భారత్ కు మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ సారి కూడా ఇండియా గెలవడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ టీ20 ఫార్మాట్ లో ఏ టీమ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు.

యూఏఈ జట్టుతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 పై ఆసక్తి నెలకొంది. వైస్ కెప్టెన్ శుభ్‍మన్ గిల్ చాలాకాలం తరువాత టీ20 ఫార్మాట్ ఆడబోతున్నాడు. ఓపెనర్ గా గిల్ తన ప్లేస్ ను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నారని తెలుస్తుంది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వస్తే.. టాప్ ఆర్డర్లో సంజు శాంసన్ ఉండే ఛాన్స్ ఉంది. 

రింకూ సింగ్‌కు బదులు శివమ్ దూబేను ఆడించే అవకాశాలున్నాయి. దుబాయ్ పిచ్ స్పిన్‌‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టీమ్ ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్లేయింగ్ 11 లో ఛాన్స్ వస్తుంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌ లేదా హర్షితా రాణా ఆడతారు. లో ఆర్డర్ బ్యాటింగ్ కావాలనుకుంటే హర్షిత్ రాణా టీమ్ లో ఉంటాడు. మొత్తానికి యూఏఈతో మ్యాచ్ లో టీమ్ ఇండియా ఎలా ఉంటుందనేది ఆసక్తిని రేపుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola