India vs Sri Lanka Women World Cup | శ్రీలంకపై భారత్ విజయం

ప్రపంచ కప్ 2025 మొదటి మ్యాచ్‌లో శ్రీలంకను 59 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 269 పరుగులు చేసింది. వర్షం కారణంగా DLS ద్వారా శ్రీలంక 47 ఓవర్లలో 271 పరుగులు చేయాల్సి ఉంది. 

ఇండియా బ్యాటర్లు ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ రాణించారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన కౌర్ 56 బంతుల్లో 57 పరుగులు చేసింది. దీప్తి శర్మ ఆల్ రౌండర్ ప్రదర్శన భారత్ శ్రీలంకపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 4 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసినప్పుడు దీప్తి శర్మ బ్యాటింగ్‌కు దిగింది. ఆ తర్వాత వచ్చిన అంజుత్ కౌర్‌తో కలిసి 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

శ్రీలంక చివరి ఓవర్ల వరకు పోరాడి ఓడిపోయింది. ఛేజింగ్ మొదలు పెట్టున లంక ... 140 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. భారత్ బౌలర్లు.. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, స్నేహ రాణా, శ్రీ చరణి చెరో రెండు వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్, అంజుత్ కౌర్, ప్రతీకా రావల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola