India vs Sri Lanka Highlights Asia Cup 2025 | లంకపై విజయం సాధించిన భారత్

ఆసియాక‌ప్ లో భారత్ వరుసగా ఆరవ సారి విక్టరీని సాధించింది. లంక‌పై.. ఇండియా 5 బంతులు మిగిలి ఉండగానే సూప‌ర్ ఓవ‌ర్లో గెలిచింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 202 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 61 పరుగులు చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఓపెన‌ర్ శుభ‌మాన్ గిల్ త్వ‌ర‌గానే వెనుదిరిగాడు.  తిల‌క్ వ‌ర్మ, సంజూ శాంస‌న్, అక్ష‌ర్ ప‌టేల్ కీల‌క ప‌రుగులు సాధించారు. దాంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. భారీ టార్గెట్ చేజింగ్ లో నిసాంక అద్బుతంగా మెరిశాడు. 52 బంతుల్లో నిసాంక సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక కూడా 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 202 ప‌రుగులే చేయ‌డంతో మ్యాచ్ టైగా ముగిసింది. 

సూప‌ర్ ఓవ‌ర్లో ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన లంక 2 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. తొలి బంతికే కుశాల్ పెరీరా ఔట్ కాగా, ఐదో బంతికి ష‌న‌క కూడా డకౌట్ అయ్యాడు. దీంతో ఇండియాకు 3 ప‌రుగుల టార్గెట్ ను లంక నిర్దేశించింది. సూర్య‌ కుమార్ యాదవ్ .. హ‌స‌రంగా బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే 3 ప‌రుగులు సాధించాడు. దాంతో ఇండియా మ్యాచ్ గెలిచింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola