India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

Continues below advertisement

భారత మహిళల జట్టు వరుస విజయాలతో జోరుమీద ఉంది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు మన అమ్మాయిలు. ఇప్పటికే రెండు టీ20 మ్యాచులు గెలిచిన టీమ్ ఇండియా .. మూడవ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. 

ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్స్ రాణించగా, రెండో మ్యాచ్‌లో షెఫాలీ వర్మ సత్తా చాటింది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉండటంతో భారత్ ఎంతటి టార్గెట్ ను ఈజీగా చేజ్ చేస్తుంది.  

బ్యాటింగ్ తోపాటు టీమ్ ఇండియా బౌలర్లు కూడా ఈ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. భారత స్పిన్నర్లు శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. రన్స్ చేయకుండా కట్టడి చేస్తున్నారు. యంగ్ ప్లేయర్లు ఎన్. శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్ సరైన టైం లో వికెట్లు తీస్తున్నారు. రెండో టీ20లో దీప్తి శర్మ, స్నేహ రాణా రాణించారు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ.. మంచి దూకుడు మీదున్న టీమ్ ఇండియా ఈ సిరీస్ ను కైవసం చేసుకుంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola