India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్ ఫైనల్
ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్ నేడు జరగబోతుంది. సొంత గడ్డపై ఎలాగైనా కప్ సొంతం చేసుకోవాలని టీమ్ ఇండియా ఎదురు చూస్తుంది. అలాగే మొదటి సారి ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా .. కప్ ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ రెండు టీంస్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరగనుంది.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్, సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ఈ టోర్నమెంటును గెలుచుకోలేదు. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సౌతాఫ్రికాను చివరిసారిగా 2005లో ఓడించింది టీమ్ ఇండియా. దీని తర్వాత ప్రతిసారి భారత్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
రెండు జట్ల మధ్య ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో రెండు జట్లు మూడుసార్లు గెలుపొందాయి. గత మూడు ప్రపంచ కప్ మ్యాచ్‌లలో సౌతాఫ్రికా లీగ్ స్టేజ్ లో ఆధిపత్యం సాధించింది. ఇప్పుడు ఈ రెండు టీమ్స్ మళ్ళి ఫైనల్‌లో ఆడబోతున్నారు. 20 ఏళ్లుగా ఆధిపత్యం సాగిస్తున్న సౌత్ ఆఫ్రికాను మన అమ్మాయిలు చిత్తూ చేస్తారా లేదా అన్ని చూడాలి.