India vs South Africa First Test Match | భారత్ ఓటమికి కారణాలివే

Continues below advertisement

సౌత్ ఆఫ్రికా టీమ్ ఇండియా మధ్య జరిగిన తోలి టెస్ట్ మ్యాచ్ లో సఫారీలు చరిత్ర సృస్టించారు. భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించిన సఫారీలు.. 15 ఏళ్ల తర్వాత భారత్‌ను భారత్‌లోనే టెస్టుల్లో ఓడించారు. దాంతో ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. అయితే చాలా తక్కువ స్కోర్ తో టీమ్ ఇండియా ఓడిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు టీమ్ ఇండియా ఓటమికి కారణాలు ఏంటని అంచనా వేయడం మొదలు పెట్టారు. 

టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్మన్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్ మీద జాగ్రత్తగా ఆడలేకపోయారు అని అంటున్నారు ఫ్యాన్స్. టెస్ట్‌లలో ఓపికగా ఆడితే మంచి రన్స్ సాధిస్తూ వికెట్స్ ని కాపాడుకోవచ్చు. దూకుడుగా ఆడి వికెట్స్ సమర్పించుకున్నారని ఫ్యాన్స్ వాదన. గత కొంత కాలంగా మన బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోలేకపోతున్నారు. ఈ టెస్టులోనూ బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. గత కొంత కాలంగా, టీమ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. హెడ్ కోచ్ చేస్తున్న ప్రయోగాలు కూడా ఓటమిని కారణమని అంటున్నారు ఫ్యాన్స్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola