India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్

Continues below advertisement

ఇండియా సౌత్ ఆఫ్రికా తోలి వన్డే మ్యాచ్ లో భారత్ విజయ సాధించింది. కానీ ఈ మ్యాచ్ చివరి వరకు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది. నిజం చెప్పాలంటే భారత్ ఓటమి అంచువరకు వెళ్లింది విజయం సాధించింది. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడి టీమ్ కు స్కోర్ అందించారు. కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్ నాక్ ఆడాడు. భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.

భారీ టార్గెట్ లో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో తడబడినా మిడిలార్డర్ ప్లేయర్స్ బాగా రాణించారు. మాథ్యూ, టోనీ జోర్జీ నాలుగో వికెట్‌కు 66 పరుగులు చేసారు. జోర్జీ వికెట్ పడిన తర్వాత వచ్చిన బ్రావిస్ కూడా మాథ్యూకు సపోర్ట్ గా నిలిచి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 

బ్రావిస్‌ను హర్షిత్ అవుట్ చేసాడు. అప్పుడు వచ్చిన యన్‌సెన్ దాదాపుగా దక్షిణాఫ్రికాను విజయానికి చేరువ చేశాడు. 39 బంతుల్లోనే 3 సిక్స్‌లు, 8 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. మాథ్యూతో కలిసి 97 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే వీరిద్దరూ వెంటవెంటనే అవుట్ అవడంతో సఫారీలకు దెబ్బ పడింది. చివర్లో బాష్ వీరోచిత పోరాటం చేసి భారత్‌ను భయపెట్టాడు. చివరకు దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. కేవలం 17 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola