India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ

Continues below advertisement

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఛేజింగ్ మొదలు పెట్టిన సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తూ వికెట్స్ ను కాపాడుకుంటూ వచ్చింది. ఆ తర్వాత మన అమ్మాయిల బౌలింగ్ కు సఫారీలు నిలవలేక పొయ్యారు. వరుసగా వికెట్స్ కోల్పోతూ ఢీలా పడ్డారు. కానీ సౌత్ ఆఫ్రికా డేంజరస్ ప్లేయర్ వోల్వార్ట్ క్రీజ్ లోనే ఉంది. తాను ఒకతి చాలు .. మ్యాచ్ మొత్తని మలుపు తిప్పడానికి. వరుస వికెట్లు పడుతున్నా సఫారీ కెప్టెన్ లారా వోల్వార్ట్ రన్స్ తీస్తుంది. 40 ఓవర్ల వరకూ క్రీజ్ లోనే ఉంటూ అందరికి భయాన్ని చూపించింది. 

ఆఖరి పది ఓవర్లలో సౌతాఫ్రికా విజయానికి 88 పరుగులు కావాలి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. అప్పుడు 42వ ఓవర్ లో దీప్తి శర్మ బౌలింగ్ కు వచ్చింది. మొదటి బంతికె వోల్వార్ట్ వికెట్ పడగొట్టింది. అదే ఓవర్‌లో క్లో ట్రయన్‌ను దీప్తి శర్మ ఎల్‌బీడబ్ల్యూ చేసింది. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ మారిపోయింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడడంతో సఫారీలు సైలెంట్ అయిపొయ్యా. 9.3 ఓవర్లు బౌలింగ్ చేసిన దీప్తి శర్మ 39 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకుంది. అలాగే అయబోంగా ఖాకాను రన్ అవుట్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ రౌం అవుట్ తో దీప్తి శర్మ జడేజాను గుర్తు చేసింది. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. మెన్, విమెన్ ప్రపంచ కప్‌ హిస్టరీలో ఒకే ఎడిషన్‌లో 200కు పైగా పరుగులు, 20కిపైగా వికెట్లు సాధించిన మొట్టమొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించింది దీప్తి శర్మ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola