India vs South Africa 5th T20 Highlights | సిరీస్ సొంతం చేసుకున్న భారత్

Continues below advertisement

ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఐదవ టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 232 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో ఛేజింగ్‌ కు దిగిన సఫారీలు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ బౌండరీలు బాదారు. తొలి పది ఓవర్లలో సఫారీల వైపు తిరిగిన మ్యాచ్ .. మిగితా 10 ఓవర్లలో మాత్రం ఇండియా మ్యాచ్ ను మలుపు తిప్పింది. 

11వ ఓవర్‌లో బుమ్రా డికాక్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే బ్రెవిస్‌ హార్దిక్ పాండ్య చేతిలో అవుట్ అయ్యాడు. 13వ ఓవర్‌ వరుసగా కెప్టెన్ మర్కరమ్, ఫెరీరా పెవిలియన్ కు చేర్చాడు వరుణ్ చక్రవర్తి. మూడు ఓవర్లలోనే సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. సౌతాఫ్రికా 154 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి మ్యాచ్ ను చేజార్చుకుంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా రెండు, పాండ్యా ఒకటి, అర్ష్‌దీప్ ఒక వికెట్ తీసుకున్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 3 - 1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola