India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు

Continues below advertisement

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో టీ20 లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా 118 పరుగుల లక్ష్యాన్ని మరో 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 237 పరుగులు మాత్రమే నమోదు అయ్యాయి. అయినా కూడా ఈ మ్యాచ్ లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. 

హార్దిక్ పాండ్యా మూడో టీ20 మ్యాచ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌ను అవుట్ చేయడంతో  ఇంటర్నేషనల్ టీ20లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు సాధించిన మొదటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్, 100 వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు.

ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 2025 లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత బ్యాటర్ తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై 70.50 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. టీ20లలో ఒక జట్టుపై అత్యుత్తమ స్ట్రైక్ రేట్ ఉన్న ఇండియా క్రికెట్ లిస్ట్ లో తిలక్ అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 4,000 పరుగులు పూర్తి చేసిన తిలక్ వర్మ విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌లను అధిగమించాడు. 

వరుణ్ చక్రవర్తి తన కెరీర్‌లో 32వ టీ20 మ్యాచ్‌లో 50 అంతర్జాతీయ వికెట్లు పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి రెండవ స్థానంలో నిలిచాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola