India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
భారత్ సౌతాఫ్రికా మధ్య మూడవ T20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్ రెండు టీమ్స్ కు చాలా కీలకం. ఇప్పటికే 1-1తో రెండు టీమ్స్ సమంగా ఉన్నాయి. దాంతో రెండు టీమ్స్ కూడా మూడవ టీ20 మ్యాచ్ గెలిచి ఆధిక్యాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నాయి.
మొదటి టీ20లో సత్తా చాటిన టీమ్ ఇండియా.. రెండవ మ్యాచ్ లో మాత్రం ప్రభావం చూపలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పూర్తిగా చేతులెత్తేసింది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. ఇలా అందరు నిరాశ పరిచారు.
ప్రస్తుతం టీమ్ ఇండియా బ్యాటింగ్ లైన్ అప్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడవ టీ20 లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఫామ్ కలిసొచ్చేలా కనిపిస్తుంది. రెండవ టీ20 లో తిలక్ వర్మ ఒంటరిగా టీమ్ ను ముందుకు తీసుకోని వెళ్ళాడు. గత మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ అంతగా రాణించలేకపొయ్యారు. కానీ ఈ మ్యాచ్లో బౌలర్లు రాణించాల్సిన అవసరం ఉంది.
ధర్మశాలలో భారత్ ఇప్పటివరకు 10 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈ పదింట్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఛేజింగ్ చేసిన జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రా గా ముగిశాయి. మరి మూడవ టీ20లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూడాలి.