India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

Continues below advertisement

ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండవ టీ20.... సౌత్ ఆఫ్రికా అద్భుత విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత్ పై 51 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసారు. 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆడలేదు. 

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. క్వింటన్ డి కాక్ 90 పరుగులు చేసి అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించాడు.

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు మంచి ఆరంభం లభించలేదు. శుభ్‌మన్ గిల్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ 5 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. అభిషేక్ 17 పరుగులు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా .. తిలక్ వర్మ దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొని నిలబడ్డాడు. 34 బంతుల్లో 62 పరుగులు చేశాడు. తిలక్ వర్మ, ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola