India vs Pakistan T20 World Cup Ishan Kishan | యువరాజ్ రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్

టీ20 వరల్డ్ కప్ 2026 లో ( T20 World Cup 2026 ) భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ( India vs Pakistan ) మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశారు. ఈ క్రమంలో ఇషాన్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20 కెరీర్ లో 9వ హాఫ్ సెంచరీ. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మన్ అయిన ఇషాన్, పాకిస్థాన్‌పై ఒక భారీ రికార్డును నెలకొల్పుతూ యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.

భారత్- పాకిస్థాన్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో యువరాజ్ కంటే వేగంగా ఫిఫ్టీ సాధించిన బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇషాన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) 2012లో పాకిస్థాన్‌పై టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.

భారత్- పాక్ మ్యాచ్‌లలో అత్యంత వేగంగా ఫిఫ్టీ సాధించిన బ్యాటర్ల జాబితాలో ఇషాన్ కిషన్ 3వ స్థానానికి చేరుకున్నాడు.  దాంతో యువీ నాలుగో స్థానానికి పడిపోయాడు. అలాగే ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. 3 మ్యాచ్‌లలో 3 ఇన్నింగ్స్‌లలో 197.50 స్ట్రైక్ రేట్‌తో 158 పరుగులు చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola