India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ

భారీ క్రేజ్ ఉన్న భారత్ పాకిస్తాన్ ( India vs Pakistan ) మ్యాచ్ కు లైన్ క్లియర్ అయింది. టీ20 వరల్డ్ కప్‌లో ( T20 World Cup ) భారత్‌తో మ్యాచ్ ఆడబోమని, బహిష్కరిస్తామని పట్టుబట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) ఎట్టకేలకు మెట్టు దిగింది. ఐసీసీతో చర్చలు,   హెచ్చరికలు, ఒత్తిళ్లతో పాక్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్ పాక్ మ్యాచ్ కు లైన్ క్లియర్ అయ్యింది. 

ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా స్వయంగా లాహోర్ వెళ్లారు. పీసీబీ ప్రతినిధులతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh Cricket Board ) సభ్యులతో చర్చలు జరిపారు. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ నుంచి వచ్చే భారీ జరిమానాలు, నిధుల నిలిపివేత వంటి పరిణామాలను ఐసీసీ వివరించినట్లు తెలుస్తోంది.

అలాగే టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్థాన్‌ను అభ్యర్థించింది. ఇలాంటి సమయంలో తమకు సపోర్ట్ గా ఉనందుకు పాకిస్తాన్ కు ధన్యవాదాలు తెలిపింది. అలాగే క్రికెట్‌ వ్యవస్థ ప్రయోజనం కోసం భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగాలని కోరింది. షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌ ఆడాలని పీసీబీని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబోలో భారత్‌, పాక్‌ మధ్య టీ20 మ్యాచ్ జరిగేందుకు లైన్‌ క్లియర్ అయ్యింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola