India vs Pakistan | Pahalgam Attack | ఈ విజయం భారత సైన్యానికి అంకితం
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇండియాకు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. అయితే పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత సూర్య ... శివం దూబేతో కలిసి డైరెక్ట్ గా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. అంతేకాకుండా, టీమిండియా డగౌట్‌లో కూర్చున్న మిగిలిన ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్... ఎలా ఎవరు కూడా గ్రౌండ్ లోకి రాలేదు. పాకిస్తాన్ ప్లేయర్స్ ను కలవలేదు. ఫార్మాలిటీకి కూడా ఎవరు బయటకు రాలేదు. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. పాకిస్తాన్‌కు టీమిండియా సరైన గుణ పాఠం నేర్పిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ మాట్లాడుతూ “పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో మేమున్నామని అన్నారు. భారత సైనికులకు ఈ విజయం అంకితం చేస్తున్నాం. వాళ్లు చూపిన ధైర్యం, త్యాగం మాకు ఎంతో ఇన్స్పిరేషన్ ని ఇస్తాయి. గ్రౌండ్ లో ఎప్పుడు ఆకాశం వచ్చినా వారిని గర్వపడేలా చేస్తాం అంటూ భావోద్వేగంతో మాట్లాడాడు కెప్టెన్ సూర్యకుమార్. పాకిస్తాన్ పై మ్యాచ్ గెలవడంతో భారత ఆటగాళ్లు... సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మ్యాచ్ పహాల్గమ్ ఉగ్రదాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం అంటూ రాసుకొచ్చారు.