India vs Pakistan Asia Cup 2025 | పాక్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వని టీమిండియా!

పహల్గామ్‌ లో జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య తోలి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ను టీమ్ ఇండియా దారుణంగా ఓడించి విజయం సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత జరిగిన ఒక సంఘటన ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మ్యాచ్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు భారత ఆటగాళ్లు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేసినప్పుడు, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్‌ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ మొదలయ్యాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ ఆడి ఆటను ముగించాడు. అయితే పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత సూర్య ... శివం దూబేతో కలిసి డైరెక్ట్ గా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. అంతేకాకుండా, టీమిండియా డగౌట్‌లో కూర్చున్న మిగిలిన ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్... ఎలా ఎవరు కూడా గ్రౌండ్ లోకి రాలేదు. పాకిస్తాన్ ప్లేయర్స్ ను కలవలేదు. ఫార్మాలిటీకి కూడా ఎవరు బయటకు రాలేదు. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. పాకిస్తాన్‌కు టీమిండియా సరైన గుణ పాఠం నేర్పిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola