India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

Continues below advertisement

భారత్, న్యూజిలాండ్‌ల ( India vs New Zealand ) మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇండియా సిరీస్‌లో 1-0 తో ఆధిక్యంలో ఉంది. రెండవ మ్యాచ్ లో కూడా గెలుస్తే భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యాన్ని సాధిస్తుంది. మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. 

ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా సుందర్ కు సైడ్ స్ట్రెయిన్ సమస్య వచ్చింది. వాషింగ్టన్ సుందర్ సిరీస్ నుంచి దూరం కావడంతో భారత టీమ్ లోకి ఆయుష్ బదోనిని ( Ayush Badoni ) తీసుకున్నారు. రెండవ వన్డేల్లో ఈ యంగ్ ప్లేయర్ అరంగేట్రం చేసే అవకాశం లభించనుంది. 

అయితే ఈ టీమ్ లో నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ), ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel ) వంటి కీలక ఆప్షన్స్ కూడా ఉన్నారు. రెండో వన్డే కోసం ఇండియా పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి ప్లేయింగ్ లెవన్ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola