India vs Namibia T20WC Highlights | నమీబియాపై భారత్ ఘనవిజయం
నమీబియాను భారత్ 93 ( India vs Namibia ) పరుగుల తేడాతో ఓడించింది. T20 ప్రపంచ కప్ చరిత్రలో పరుగుల పరంగా ఇది టీం ఇండియాకు అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 209 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన నమీబియా 116 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించారు. డెత్ ఓవర్లలో నమీబియా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. చివరి నాలుగు ఓవర్లలో టీం ఇండియా కేవలం 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ ( Ishan Kishan ), హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) హాఫ్ సెంచరీలు చేశారు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 12 పరుగులు మాత్రమే చేయగా, తిలక్ వర్మ 25 పరుగులు మాత్రమే చేశాడు. ఇండియా బౌలింగ్‌లో కూడా సత్తా చాటింది. వరుణ్ చక్రవర్తి ( Varun Chakravarthy ) 2 ఓవర్లలో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
నమీబియాను 93 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. వరుసగా అత్యధిక టీ20 ప్రపంచ కప్ ( T20 World Cup ) విజయాలు సాధించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది.