India vs England Yashasvi Jaiswal Century | సచిన్ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్
[10:33, 03/08/2025] Vaishu Reddy: ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో సత్తా చాటి సంగతి తెలిసిందే. కెరీర్ లో ఆరో సెంచరీ సాధించడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. అలాగే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్ లో తొమ్మిదోసారి 50 ప్లస్ స్కోరును చేసాడు. ఇంగ్లాండ్ పై 23 ఏళ్ల వయసులో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. తను 19 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనతను సాధించడం విశేషం. గతంలో ఇదే వయసులో ఉన్నప్పుడు 14 ఇన్నింగ్స్ లో సచిన్ 8 సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
సేనా కంట్రీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన జాబితాలోకి జైస్వాల్ ఆల్రెడీ చేరి పోయాడు.అలాగే ఈసారి ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన తొలి టెస్టు... తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ చేశాడు. ఇక ఐదో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో మళ్ళి సెంచరీ చేసాడు. దీంతో ఇంగ్లాండ్ కు దీటైన టార్గెట్ ను టీమిండియా నిర్దేశించింది.
[10:44, 03/08/2025] Vaishu Reddy: