India vs England Test Series | చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లాండ్ - భారత్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ హోరాహోరీగా కొనసాగుతుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు టీం ఇండియా అల్ అవుట్ అయింది. యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలతో అక్కటుకునారు. జోష్ టంగ్, బెన్ స్టోక్స్‌కు చెరో నాలుగు వికెట్లు దక్కాయి. ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. ఓపెనర్ జాక్ క్రాలే 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇండియా బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటు ఓలి పోప్ సెంచరీ చేసాడు. ఆ తర్వాత బెన్ డకెట్ ఔట్ చేసి టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జో రూట్ 28 పరుగులకె అవుట్ అయ్యాడు. స్లిప్‌లో కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జో రూట్. బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకే మూడు వికెట్ల దక్కాయి. ఓలి పోప్ , హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లతో బుమ్రా సేనా SENA దేశాల్లో టెస్టు అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలను కలిపి SENA దేశాలు అని అంటారు.