India vs England Day 2 Highlights | రెండవ టెస్ట్ లో డామినేట్ చేస్తున్న ఇండియా

బర్మింగ్‌హామ్ టెస్టులో రెండో రోజు పూర్తిగా భారత్ ఆధిప‌త్యం ప్రదర్శించింది. రెండో రోజు భారీ స్కోరు చేసిన భార‌త్.. బౌలింగ్ లో ఇంగ్లాండ్ ను క‌ట్టి ప‌డేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకి ఆలౌట్ అయిన టీం ఇండియా.. రెండో రోజు ఆట ముగిసే టైంకి ఇంగ్లాండ్ వి 3 వికెట్లు పడగొట్టింది. ఫ్లాట్ వికెట్ పై ఇండియన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. త‌క్కువ వ్య‌వ‌ధిలోనే మూడు వికెట్లు తీసి, స‌త్తా చాటారు. త‌న రెండో ఓవ‌ర్లోనే వ‌రుస బంతుల్లో బెన్ డ‌కెట్ ని డ‌కౌట్ చేశాడు ఆకాశ్ దీప్. వెంటనే కి ఓల్లీ పోప్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 

దాంతో 13 పరుగులకే 2 వికెట్లను ఇంగ్లాండ్  కోల్పోయింది. ఆ కొద్దీ సెప్పటికే జాక్ క్రాలేని సిరాజ్ అవుట్ చేశాడు. జో రూట్, హ్యారీ బ్రూక్ కలిసి 52 పరుగులు చేసారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది ఇంగ్లాండ్. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ స్కోర్ 587. ఇంగ్లాండ్ ఇంకా 510 పరుగులు వెనకబడి ఉంది. మూడో రోజు ఆట కీలకంగా మారనుంది. ఇంగ్లాండ్‌ని వీలైనంత తక్కువ స్కోరుకి పరిమితం చేస్తే.. ఈ మ్యాచ్ గెలిచి కమ్‌బ్యాక్ ఇవోచు. రన్స్ పరంగా డామినెటే చేయాలనుకుంటే జో రూట్‌ని తొందరగా అవుట్ చేయాల్సిందే. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్స్ మంచి ప్రదర్శన కనబరించారు.  ఓపెనర్లు చేతులిచ్చేసినా యశస్వి జైస్వాల్ రాణించాడు. రవీంద్ర జడేజా 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్ 269 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola