India vs England 5th Test Match | భారత్ సిరీస్ ను సమం చేయగలదా ?

ఇంగ్లాండ్, ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మూడో రోజు ఓవ‌ర్ నైట్ స్కోరు 75/2 తో రెండో ఇన్నింగ్స్ ను కొన‌సాగించిన భార‌త్ 396 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. య‌శ‌స్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. 374 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసేస‌రికి 13.5 ఓవ‌ర్ల‌లో  వికెట్ నష్టానికి 50 ప‌రుగులు చేసింది. క్రీజులో బెన్ డకెట్ ఉండగా, జాక్ క్రాలీని  మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. విజ‌యానికి ఇంకా ఇంగ్లాండ్ 324 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఇండియాకు 9 వికెట్లు కావాలి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే 3-1తో సిరీస్ కైవ‌సం చేసుకుంటుంది. అలాగే ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే, 2-2తో సిరీస్ ను స‌మం చేస్తుంది. ఏదేమైనా నాలుగో రోజు ఆట‌లో ఫ‌లితం తేలే అవ‌కాశం ఉంది. 

తొలి టెస్టులో సెంచరీ తర్వాత మ‌ళ్లీ ఈ టెస్టులోనే జైస్వాల్ సెంచ‌రీని సాధించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లాండ్ కు శుభారంభం ద‌క్కింది. ఓపెన‌ర్లు క్రాలీ, డకెట్ క‌లిసి క‌రెక్టుగా 50 ప‌రుగులు చేసారు. అయితే ఆట చివ‌రి ఓవ‌ర్లో సిరాజ్.. క్రాలీని ఔట్ చేశాడు. చివ‌రి రోజు వీలైనంత త్వ‌ర‌గా టాపార్డ‌ర్ వికెట్లు తీస్తే, టీమిండియా ఈ మ్యాచ్ ను గెలిచే అవ‌కాశ‌ముంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola